Uday Bhanu | రీసెంట్ డేస్‌లో సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు, యాంకర్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. సుమ కనకాల, అనసూయ, రష్మీ లాంటి వారు టాప్ యాంకర్లుగా బిజీగా ఉంటే… ఒకప్పుడు బుల్లితెరను షేక్ చేసిన యాంకర్ ఉదయభాను ఇప్పుడు పలు ఈవెంట్స్‌లో యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తుంది. ఉదయ భాను అప్పట్లో హృదయాంజలి వంటి కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. గలగలా మాట్లాడే స్టైల్, చలాకీదనం, గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఢీ, పిల్లలు పిడుగులు వంటి పాపులర్ షోల్లో యాంకర్‌గా మెరిశారు. సినిమాల్లోనూ నటించిన ఆమె, కొంతకాలంగా యాంకరింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, ఆమెకున్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు.చాలా గ్యాప్ తర్వాత ఉదయభాను ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యాంకర్‌గా హాజరై చర్చనీయాంశంగా మారింది . ఈ ఈవెంట్లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఉదయభాను మాట్లాడుతూ .. మళ్లీ ఈవెంట్ చేస్తానో లేదో గ్యారంటీ లేదు. రేపే ఈవెంట్ అనుకుంటాం, కానీ ఆ రోజు మనకి ఈవెంట్ ఉండదు. ఇండస్ట్రీలో ఇది పెద్ద సిండికేట్ మాదిరి తయారైంది” అని ఆమె చెప్పారు.
హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఈవెంట్ హోస్ట్ చేశాను. మనసులో మాట చెబుతున్నా అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు యాంకరింగ్ రంగంలో ప్రస్తుతం జరుగుతున్న నెపొటిజం, గ్రూపిజం పట్ల ఆమె అసంతృప్తిని బహిర్గతం చేశాయి. ఇక ఈ ఈవెంట్లో రచయిత, నటుడు మచ్చ రవి మాట్లాడుతూ..”ఉదయభాను మైక్ పట్టుకుంటే, అది ఒక నారి వంద తుపాకుల్లా ఉంటుంది” అన్నారు.దానికి ఉదయభాను నవ్వుతూ స్పందిస్తూ.. నాకు చాలా బుల్లెట్లు తగిలాయి… అది ఎవరికీ తెలియదు అంటూ సున్నితంగా కౌంటర్ ఇచ్చారు.ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.