Khalistani Terrorist | కెనడా (Canada)లో ఖలిస్థానీ ఉగ్రవాదులు (Khalistani Terrorist) మరోసారి రెచ్చిపోయారు. బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ (Kapil Sharma)కు చెందిన కేఫ్ (Cafe)పై కాల్పులు జరిపారు. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. కేఫ్‌పై కాల్పులకు ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ బాధ్యత వహించారు. కేఫ్‌పై తానే కాల్పులు జరిపినట్లు ప్రకటించారు.
కెనడా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో నుంచి తొమ్మిది రౌండ్లు కేఫ్‌పై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి. కాగా, కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గల సర్రే ప్రాంతంలో ‘కాప్స్ కేఫ్’ (Kap’s Cafe) పేరుతో కపిల్ శర్మీ దీన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ కేఫ్‌ను ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం.
Also Read..
Shubhanshu Shukla | ఐఎస్ఎస్లో ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న శుభాన్షు శుక్లా.. PHOTOS
Chhangur Baba: చంగూర్ బాబా అకౌంట్లలో 106 కోట్లు.. దర్యాప్తు చేపడుతున్న ఈడీ
Newborn | పెండ్లి కాకుండా తల్లయిన యువతి.. 50 వేలకు నవజాత శిశువును అమ్మేసింది