Shehbaz Sharif |న్యూఢిల్లీ: భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం తమ దేశం సాధించిన చారిత్రక విజయమని పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చెప్పుకున్నారు. భారత్ దూకుడుకు సైన్యం ‘ప్రొఫెషనల్’గా, ‘ఎఫెక్టివ్’గా స్పందించిందని పేర్కొన్నారు. తమ దేశంపై దాడికి పహల్గాం దాడిని భారత్ సాకుగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. తమ చర్యలు ద్వేషం, దూకుడు, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగానేనని స్పష్టం చేశారు. ఇది తమ సిద్ధాంతాలు, గౌరవం సాధించిన విజయమని చెప్పుకొచ్చారు.
ఈ విజయం సాయుధ దళాలది మాత్రమే కాదని, దేశం మొత్తానిదని పేర్కొన్నారు. శత్రుదేశానికి అర్థమైన భాషలోనే సమాధానం చెప్పాలని ముందే నిర్ణయించుకున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆత్మగౌరవం, నిజాయతీ గల దేశమని చెప్పేందుకు కాల్పుల విరమణ ఒక ఉదాహరణ అని షాబాజ్ పేర్కొన్నారు.