Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం గల్ఫ్ దేశాలకు పాకింది. అమెరికా దాడలకు ప్రతీకారంగా ఇరాన్.. నిన్న రాత్రి ఖతార్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఖతార్ (Qatar)లోని అమెరికా వైమానిక స్థావరం అల్-ఉదీద్పై (US Al-Udeid base) క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఒక్కొక్కటిగా తమ గగనతలాన్ని మూసివేశాయి (Gulf shuts airspace).
ఈ దాడులతో ఖతార్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఖతార్ ప్రకటన తర్వాత మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఒక్కోటి తమ గగనతలాన్ని మూసివేశాయి. కువైట్, బెహ్రైన్, యూఏఈ తమ ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రకటనతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం (Several flights cancelled) ఏర్పడింది. దీంతో ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. మరికొన్నింటిని దారి మళ్లించాయి. దీంతో ఇరాన్, ఇరాక్, సిరియా, ఇజ్రాయెల్ గగనతలాలు ఖాళీ అయ్యాయి.
Also Read..
Qatar | అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక అడ్వైజరీ
Operation Sindhu: ఆపరేషన్ సింధు.. ఇజ్రాయిల్ నుంచి ఢిల్లీ చేరుకున్న 161 మంది భారతీయులు
Israel-Iran | ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించిన ఇరాన్.. పలువురు మృతి