బ్రసెల్స్: బెల్జియం(Belgium)లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. ఓ స్కూల్ బస్సును.. రైలు ఢీకొన్నది. ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ప్రమాద బాధితుల్లో చాలా మంది ఉన్నట్లు బెల్జియం మంత్రి బెర్నార్డ్ క్వింటిన్ తెలిపారు. అయితే అధికారులు మాత్రం కచ్చితమైన మృతుల సంఖ్యను వెల్లడించలేదు. బుగ్గెన్హోట్లో జరిగిన ప్రమాదం విషాదాన్ని నింపిందని, బాధితుల పట్ల సంతాపం చెబుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులు ప్రమాద ప్రాంతానికి చేరుకున్నాయి. రెస్క్యూ, రిలీఫ్ చర్యలు చేపట్టారు. ఏ కారణం చేత బస్సు, రైలు ఢీకొన్నాయన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు.