Saudi Arabia | రియాద్, మే 26: సౌదీ అరేబియాలో గత 73 ఏండ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. మద్యం కొనుగోలు, వినియోగంపై ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని 2026లో ఎత్తివేస్తున్నట్టు సౌదీ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. కఠినమైన లైసెన్సింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా సుమారుగా 600 వరకు నిర్దేశిత ప్రాంతాల్లో నియంత్రిత మద్యం అమ్మకాలు చేపట్టాలని సౌదీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. రియాద్ ఎక్స్పో, ఫిఫా ప్రపంచ కప్ సహా పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌కు ఆ దేశం అతిథ్యం ఇవ్వబోతున్నది. దీంతో మద్యపానంపై విధానాన్ని మార్చుతోంది.