వాషింగ్టన్ : అమెరికాతో ఒప్పందం చేసుకునేంత వరకు ఇరాన్‌పై ఆంక్షల్ని ఎత్తివేయబోమని, స్తంభింపజేసిన ఆస్తుల్ని విడుదల చేయబోమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం చర్చల ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడుతూ, ‘ఇరాన్‌తో తుది ఒప్పందం కుదిరే వరకు, ఆ దేశంపై ఆంక్షల సడలింపునకు ఆస్కారమే లేదు.
ఇరాన్ నాయకత్వం ఒక ఒప్పందానికి అంగీకరించి, తన కట్టుబాట్లను నెరవేర్చిన తర్వాత ఆర్థిక ఒత్తిడిలో సడలింపు వస్తుంది’ అని అన్నారు. ఒప్పందం కుదిరితే.. యురేనియం నిల్వల్ని నాశనం చేయడానికి ఇరాన్‌తో అమెరికా కలిసి పనిచేస్తుందన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే బలప్రయోగానికి అమెరికా సిద్ధమవుతుందని ట్రంప్ హెచ్చరించారు.