ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యా దళాలు అత్యంత క్రూరంగా, మానవత్వం కోల్పోయి ప్రవర్తిస్తున్నాయని ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. తాజాగా బుకా ప్రాంతంలోని ఒక ఇంట్లో రష్యా సైనికులు అమానవీయ ఘటనకు పాల్పడ్డారని చెప్పారు. ఒక ఇంట్లో చొరబడిని సైనికులు.. తల్లిని మంచానికి కట్టేసి, ఆమె కళ్ల ముందే 11 ఏళ్ల పిల్లాడిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు ఉక్రెయిన్‌లో మానవ హక్కుల విభాగం పార్లమెంటరీ కమిషనర్ ల్యూడిమిలా డెనిసోవా ఈ విషయాన్ని వెల్లడించారు.
అంతేకాకుండా మరో ఘటనలో ఐదుగురు సైనికులు కలిసి ఒక 14 ఏళ్ల అమ్యాయిని బలాత్కరించారని ఆమె తెలిపారు. అలాగే ఏప్రిల్ 8వ తేదీన రష్యా బలగాలు 1.20 లక్షలమంది ఉక్రెయిన్ చిన్నారులను కిడ్నాప్ చేశాయని, వారిలో చాలామందిని అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నాయని ఆమె ఆరోపించారు.