మాస్కో : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఘాటుగా హెచ్చరించారు. ఇంగిత జ్ఞానం ఉంటే, చర్చల ద్వారా యుద్ధానికి తెర దించాలని చెప్పారు. తాను దీనికే ప్రాధాన్యం ఇస్తానన్నారు. బలప్రయోగం ఒక్కటే మార్గం అయితే, తాను బలప్రయోగం ద్వారానే యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
బీజింగ్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ హెచ్చరిక పంపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నదని గుర్తు చేశారు. జెలెన్స్కీ మాస్కోకు వస్తే, తాను ఆయనతో చర్చలకు సిద్ధంగా ఉన్నానన్నారు.