Russian Helicopter | రష్యాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్ (Russian Military Helicopter) ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిపోయింది (Helicopter Crashes). ఈ ఘటనలో సిబ్బంది మృతి చెందారు. నైరుతి రష్యాలోని జనావాసాలు లేని ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది.
రష్యాకు చెందిన ఎంఐ – 28 మిలిటరీ హెలికాప్టర్ (Mi 28 Military Helicopter) గురువారం ఉదయం కూలిపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కలుగ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ అయినట్లు తెలిపింది. ఈ ఘటనలో సిబ్బంది మరణించినట్లు వెల్లడించింది (Crew Dead). ‘కలుగ ప్రాంతంలో ఒక ఎంఐ – 28 క్రాష్ అయ్యింది. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 150 కిలోమీటర్ల (93 మైళ్ల) దూరంలో అడవిలో కూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణం’ అని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపినట్లు రష్యన్ మీడియా నివేదించింది.
Also Read..
Indian Origin MP | ఖలిస్తానీ తీవ్రవాదుల వల్ల కెనడా కలుషితమవుతోంది : భారత సంతతి ఎంపీ
Mamata Banerjee | దీదీ వ్యాఖ్యలు ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరేలా ఉన్నాయ్ : బంగ్లాదేశ్
Manali | మనాలీలో మెరుపు వరదలు.. ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన ప్రజలు