దావోస్: ఉక్రెయిన్, అమెరికా, రష్యా తొలి త్రైపాక్షిక సమావేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో శుక్ర, శనివారాల్లో జరుగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్యానెల్ డిస్కషన్ అనంతరం గురువారం ఆయన ఈ ప్రకటన చేశారు.
ఈ తొలి త్రైపాక్షిక సమావేశం టెక్నికల్ స్థాయిలో జరుగుతుందని, యుద్ధం ముగిసిపోవడానికి దారి తీస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఎటువంటి చర్చలు లేకుండా కాలం గడపటం కన్నా ఇది మంచిదేనని తెలిపారు. అంతకుముందు ఓ గంట సేపు ఆయన ట్రంప్‌తో సమావేశమయ్యారు.