అబుదాబి : రష్యా, ఉక్రెయిన్, అమెరికా తొలి త్రైపాక్షిక చర్చలు శుక్రవారం అబుదాబిలో ప్రారంభమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి. యుద్ధం సమయంలో తాను ఆక్రమించుకున్న ఈస్టర్న్ డాన్‌బాస్‌ను ఖాళీ చేసేది లేదని రష్యా స్పష్టం చేసింది.
బ్రసెల్స్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జగడమనేది చెడ్డ ఆలోచన అని ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అన్నారు. బ్రసెల్స్‌లో గురువారం జరిగిన సమావేశంలో యూరోపియన్ యూనియన్ దేశాల అధినేతలతో ఆమె మాట్లాడుతూ, అమెరికాతో ఘర్షణ వల్ల యూరోప్ అన్ని విధాలుగా నష్టపోతుందని చెప్పారు. అందరూ మౌనంగా ఉండాలని, ట్రంప్ పిచ్చోడు, అంచనాలకు అందనివాడు అంటూ కొట్టిపారేయవద్దని ఆమె సలహా ఇచ్చారు. ఆమె ఈ నేతలతో ప్రైవేట్‌గా సంభాషించినపుడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.