శనివారం 30 మే 2020
International - May 09, 2020 , 14:41:41

విజృంభిస్తున్న వైరస్‌..వరుసగా ఏడోరోజు 10వేలకు పైగా కేసులు

విజృంభిస్తున్న వైరస్‌..వరుసగా ఏడోరోజు 10వేలకు పైగా కేసులు

మాస్కో: ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా కరోనా దెబ్బకు అతలాకుతలమవుతోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2లక్షలకు చేరువైంది. వరుసగా ఏడోరోజూ పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,817 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 198,676కు పెరిగింది.

ఒక రోజు వ్యవధిలో మరో 104 మంది చనిపోవడంతో కరోనా వల్ల ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,827కు చేరింది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉండటం గమనార్హం.  దేశరాజధాని మాస్కోలోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడగించారు. 


logo