KCR | లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఈనెల 22 నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని కేసీఆర్ నిర్ణయించారని సీఈవో దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు సీఈవోకు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కే.వాసుదేవరెడ్డి వినతి పత్రం అందజేశారు. బస్సు యాత్రకు తగిన భద్రత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు పోలీసులు భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని.. సమస్మాత్మక ప్రాంతాల్ని గుర్తించి వాటిపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని.. అవసరమైతే కేంద్ర బలగాలను మొహరించాలని కోరారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై, సోషల్‌మీడియా వారియర్స్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని.. బీఆర్ఎస్ కడుతున్న ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగిస్తుందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ చేవెళ్ల సభకు సంబంధించి, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగిన బహిరంగ సభలో పెట్టిన ఫ్లెక్సీలను తొలగించారని తెలిపారు.