నిజాయితీపరులకు ఓటు వేయండి
అదాలత్ జంక్షన్ వద్ద శుక్రవారం మానవహారం ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. సమర్థత, జవాబుదారీతనం కలిగిన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
హనుమకొండ/హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 19 : అదాలత్ జంక్షన్ వద్ద శుక్రవారం మానవహారం ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. సమర్థత, జవాబుదారీతనం కలిగిన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. నాయకులిచ్చే కానుకలు, డబ్బులకు తల్లి లాంటి ఓటును అమ్ముకోవద్దని, తాతాలిక అవసరాలకు లొంగిపోయి ఓటు వేస్తే ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉందన్నారు. శారీరక దివ్యాంగు లు, చూపు లేని వారు, బధిరులు తమ ఓటు హకును వినియోగించుకునేందుకు వీల్ చైర్, ర్యాంపు, సంకేత భాష, బ్రెయిలీ లిపి బ్యాలెట్ పేపర్, వృద్ధులకు వలంటీర్ల సహాయం అందిస్తున్నామని పే ర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సాం స్కృతిక సారథి కళాకారులు పాడిన పాట లు ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా ఉన్నతాధికారులు గాల్లోకి బెలూన్లను వదిలారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, రాధికాగుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్డీవో నాగపద్మిని, డీడబ్ల్యూవో మధురిమ, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రాంరెడ్డి, పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు భాను ప్రసాద్, డీఈ భూపాల్ రెడ్డి, జిల్లా స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ పసునూరి సంపత్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లను వేగవంతం చేయాలి..
ధర్మసాగర్/వేలేరు : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ధర్మసాగర్‌లోని పీఏసీఎస్, నారాయణగిరి, వేలేరులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెంటర్లకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టి మిల్లులకు పంపించాలన్నారు. వర్ష సూచనలు ఉండడంతో ఎనుమాముల మార్కెట్ నుంచి టార్పాలిన్లు తెచ్చుకోవాలన్నారు. డీసీవో రవీంద్ర, డీఎం మహేందర్, ఏడీఏ దామోదర్ రెడ్డి, తహసీల్దార్ సదాందం, ఏవో పద్మ, డీటీ రమేశ్, ఏఈవో దివ్య, పీఏసీఎస్ సీఈవో రాజిరెడ్డి ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

