Vladimir Putin: అణు యుద్ధానికి రెఢీగా ఉన్నాం: పుతిన్
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. సాంకేతికంగా తాము అణ్వాయుధ యుద్ధానికి రెఢీగా ఉన్నామన్నారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు అమెరికా తమ దళాలను పంపిస్తే, యుద్ధం మరింత జఠిలం అవుతుందని అన్నారు.
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. సాంకేతికంగా తాము అణ్వాయుధ యుద్ధానికి రెఢీగా ఉన్నామన్నారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు అమెరికా తమ దళాలను పంపిస్తే, యుద్ధం మరింత జఠిలం అవుతుందని అన్నారు. అణ్వాయుధం వాడాల్సిన పరిస్థితి లేదు కానీ, మిలిటరీ కోణంలో ఆలోచిస్తే తాము రెఢీ ఉన్నామని తెలిపారు. రోసియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ అమెరికా న్యూక్లియర్ టెస్టింగ్ చేపడితే, అప్పుడు తాము కూడా ఆ పరీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో మానవ హనన ఆయుధాలను ఇప్పటి వరకు వినియోగించలేదని పుతిన్ స్పష్టం చేశారు. అణ్వాయుధాలు ఉన్నాయని, కానీ వాటి వినియోగించేందుకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. రష్యా సార్వభౌమత్వానికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే అప్పుడు వెపన్స్ వాడుతామని ఆయన తెలిపారు. తమ వ్యూహాల్లో అన్నీ ఉన్నాయని, వాటినేమీ మార్చలేదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

