Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి పాశ్చాత్య దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలు రష్యాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇస్లామిక్ స్టేట్ (ISIS) రష్యాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నంత కాలం దాని కార్యకలాపాలను ఎవరూ పట్టించుకోరన్నారు. మాస్కోలో పేలుళ్లు జరిగాయని.. ఇప్పటికీ జరుగుతున్నా ఎవరూ శ్రద్ధ చూపడం లేదన్నారు. రష్యాకు వ్యతిరేకంగా ఉన్నంత వరకు ప్రతిదీ సరైందేనని భావిస్తారని విమర్శించారు. పాశ్చాత్య దేశాలు సమష్టిగా రష్యాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని.. రష్యాపై పోరాటంలో ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించారని విమర్శించారు. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య ఘర్షణ కొనసాగుతున్న సమయంలోనే రష్యా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు.