ఉక్రెయిన్ వద్ద ఉన్న లాంగ్ రేంజ్ ఆయుధాలను ధ్వంసం చేయాలని రష్యా బలగాలకు సూచనలు అందాయి. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రి సెర్గేయ్ షోగు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఉక్రెయిన్‌లో ఉన్న లాంగ్ రేంజ్, ఆర్టిలరీ ఆయుధాలను ధ్వంసం చెయ్యండి. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న డోన్బాస్ ప్రాంతంలో ప్రజలు నివశించే రెసిడెన్షియల్ ప్రాంతాలను వీటితో ధ్వంసం చేస్తున్నారు.
కాబట్టి ఈ ఆయుధాలను ముందు నాశనం చెయ్యండి’’ అని ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా మిలటరీ దళం వాస్తోక్ గ్రూప్ కమాండర్‌కు షోగు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఉక్రెయిన్‌లోని ఆహార పంటలను తగలబెట్టేయాలని కూడా సూచనలు చేసినట్లు తెలుస్తోంది.