కీవ్: ఉక్రెయిన్పై మంగళవారం రష్యా దాడి(Russia Attack) చేసింది. రకరకాల డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేసింది. కీవ్లోని రెసిడెన్షియల్ ప్రాంతాలతో పాటు ఒడిసా నగరంలోని మెటర్నిటీ ఆస్పత్రిని టార్గెట్ చేశారు. రష్యా తన అటాక్ సమయంలో 315 షాహిద్ టైప్ యూఏవీలను, డెకాయ్ డ్రోన్లు, రెండు కేఎన్-23 బాలిస్టిక్ మిస్సైళ్లు, అయిదు ఇస్కాండర్ కే క్రూయిజ్ మిస్సైళ్లను వాడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్నే ప్రధానంగా టార్గెట్ చేశారు. అటాక్ తర్వాత అనేక జిల్లాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు నిర్వహిస్తున్నామని కీవ్ మేయర్ విటాలీ క్లిచ్కో తెలిపారు.
మంగళవారం ఉదయం కీవ్ అధికారులు స్థానిక ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఒడిసా పట్టణంపై కూడా మంగళవారం భీకర దాడులు జరిగాయి. రష్యాకు చెందిన వైమానిక టార్గెట్లను నిర్వీర్యం చేశామని, 322 టార్గెట్లలో 284 కూల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్నది. కీవ్, ఒడిసా, డిన్ప్రో, చెర్నిహైవ్ ప్రాంతాలపై అతిపెద్ద దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.