సోమవారం 18 జనవరి 2021
International - Jan 11, 2021 , 12:20:35

ర‌ష్యాలో యూకే న్యూ స్ర్టెయిన్‌..

ర‌ష్యాలో యూకే న్యూ స్ర్టెయిన్‌..

మాస్కో : బ‌్రిట‌న్‌లో బ‌య‌ట‌ప‌డ్డ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్‌ ప్ర‌పంచ దేశాల‌కు వ్యాపిస్తోంది. ఇప్ప‌టికే ఆయా దేశాల‌కు వ్యాపించిన కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ తాజాగా ర‌ష్యాకు తాకింది. ర‌ష్యాలో తొలిసారి కొత్త ర‌కం క‌రోనా కేసు న‌మోదైంద‌ని ఆ దేశ అధికారులు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తం అయ్యామ‌ని, ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. గ‌డిచిన 24 గంట‌ల్లో ర‌ష్యాలో కొత్త‌గా 22,851 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.