మాస్కో: ఎనర్జీ డ్రింక్స్‌ను తాగడం వల్ల బాలలకు గుండె జబ్బుల ముప్పు ఉంటుందని అధ్యయనాలు వెల్లడించినట్లు రష్యా హెచ్చరించింది. 18 ఏళ్ల లోపు వయసు గల బాలలు వీటిని తాగరాదని తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ చట్టాన్ని ఆమోదించింది.
ఈ చట్టాన్ని ఉల్లంఘించే బాలలకు రూ.30,000 నుంచి రూ.53,000 వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించే అధికారులకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు; లీగల్ ఎంటిటీస్‌కు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది.