న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఐక్యరాజ్యసమి భద్రతా మండలి ప్రతిపాదించిన తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేశాయి. రెండు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉంటాయని ఆశతో పదేపదే సవరించిన తీర్మానాన్ని యూఎన్ మంగళవారం ఓటింగ్‌కు ప్రవేశపెట్టింది. తీర్మానానికి అనుకూలంగా 11, వ్యతిరేకంగా 2 ఓట్లు పడగా రెండు దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఈ ఓటింగ్ జరిగింది. ఒకవేళ ఆ తీర్మానం ఆమోదం పొందినప్పటికీ ఇప్పుడు ఐదవ వారంలోకి ప్రవేశించిన యుద్ధంపై అది ప్రభావం చూపి ఉండేదో లేదో సందేహమే. రష్యా, చైనా తీర్మానాన్ని వీటో చేసే బదులు ఓటింగ్‌కు దూరంగా ఉండేలా చేయడానికి దాన్ని గణనీయంగా బలహీనపరిచినప్పటికీ ఫలితం దక్కలేదు.