న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సుంకాలు విధించే అధికారంపై ఆ దేశ సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. తదుపరి విచారణ తేదీన తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. అయితే వాయిదా తేదీని మాత్రం కోర్టు వెల్లడించలేదు. కాగా, ప్రపంచ దేశాలపై తాను విధించిన సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన పక్షంలో అది అమెరికా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించారు. విచారణలో మూడు అభిప్రాయాలను వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ట్రంప్ సుంకాల చట్టబద్ధతపై మాత్రం తీర్పు ఇవ్వలేదు.