Pakistan | ఇస్లామాబాద్, ఏప్రిల్ 27 : ఇప్పటికే తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో కునారిల్లుతున్న పాకిస్థాన్‌కు పులిమీద పుట్రలా భారత్ విధించిన పహల్గాం ఆంక్షలు కూడా తోడవ్వడంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. భారత్‌తో ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చునన్న వార్తలతో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కింది. ఇప్పటికే ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
బియ్యం, కూరగాయ లు, పండ్లు, చికెన్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అక్కడ కేజీ చికెన్ ధర రూ.798, కిలో బియ్యం ధర 339, గుడ్లు డజన్ 332, ఆపిల్ కేజీ 288, పాలు లీటర్ 224, బ్రెడ్ 500 గ్రా. 161, అరటిపండ్లు కిలో 176, టమోటా కిలో 150, ఆలుగడ్డ కిలో 105, ఆరెంజ్ కిలో రూ.216ల ధర పలుకుతున్నాయి. ఎగుమతులపై భారత్ విధించిన ఆంక్షల కారణంగా పాకిస్థాన్‌లో పలు అత్యవసర మందులకు తీవ్ర కొరత ఏర్పడుతుందని అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు.