Bird Divorce | సిడ్నీ: మనుషుల్లానే అనేక పక్షులు సైతం చాలాకాలం ఒకే సహచరితో జీవిస్తాయని, కొన్ని సందర్భాల్లో మనుషుల్లానే విడిపోతాయని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. మాక్వారీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సీషెల్స్ ద్వీపాల్లో కనిపించే సీషెల్స్ వార్బ్లెర్ అనే పక్షులపై అధ్యయనం జరిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పక్షులు ఎక్కువగా విడిపోతున్నట్టు వీరు గుర్తించారు.
ఈ పక్షులు 15 ఏండ్ల పాటు కలిసి ఉంటాయని, యేటా 1 నుంచి 16 శాతం వరకు తమ బంధాన్ని తెంచుకుంటున్నాయని పరిశోధకులు తెలిపారు. సంతానోత్పత్తి సమయంలో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పక్షులు ఎక్కువగా విడిపోతున్నట్టు గుర్తించామని చెప్పారు. కాబట్టి, వాతావరణ మార్పుల ప్రభావం పక్షుల సం తానోత్పత్తిపైనా పడుతున్నదని తెలిపారు.