Vladimir Putin | మాస్కో: తమ రాజ్యాధికారం, సార్వభౌమత్వం, స్వాతంత్య్రానికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలు వాడేందుకు వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. అణు వివాదాన్ని సృష్టించే చర్యలకు అమెరికా దూరంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ పశ్చిమ దేశాలకు పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. టెలివిజన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జోబైడెన్‌ను అనుభవజ్ఞడైన రాజకీయవేత్తగా అభివర్ణించారు. ప్రపంచం అణుయుద్ధంవైపు వెళ్తుందని తాను అనుకోవడం లేదన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.