Vladimir Putin | త్వరలో భారత పర్యటనకు పుతిన్.. వెల్లడించిన క్రెమ్లిన్
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin) త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు.
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin) త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. గతేడాది మాస్కో పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆహ్వానం మేరకు.. పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది.
‘పుతిన్ భారత పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు. గతేడాది మోదీ మాస్కోలో పర్యటించారు.. ఇప్పుడు మా వంతు’ అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. అయితే, పుతిన్ పర్యటనకు సంబంధించి కచ్చితమైన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్ భారత్‌లో పర్యటించనుండడం ఇదే తొలిసారి కానున్నది. ఈ పర్యటన పుతిన్‌కు ఎంతో కీలకం కానున్నది.
వాస్తవానికి రష్యా, భారత్ మధ్య ఓ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం అగ్రనేతలు సంవత్సరంలో ఒకసారి ఒకరి దేశంలో మరొకరు సంప్రదించాల్సి ఉంది. ఈ క్రమంలో గతేడాది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాస్కోలో పర్యటించిన విషయం తెలిసిందే. ప్రధాని తన పర్యటనలో పుతిన్‌ను భారత్‌కు ఇన్వైట్ చేశారు. మోదీ ఆహ్వానం మేరకు ఇప్పుడు పుతిన్ భారత పర్యటనకు రానున్నారు.
Also Read..
Zelensky | పుతిన్ త్వరలోనే మరణిస్తాడు.. యుద్ధం ముగుస్తుంది.. జెలెన్స్కీ షాకింగ్ కామెంట్స్
America | యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థినికి బేడీలు వేసి తీసుకెళ్లిన అధికారులు.. వీడియో వైరల్
Donald Trump | ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. విదేశీ కార్లపై 25 శాతం సుంకం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

