Zelensky | ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (Zelensky) షాకింగ్ కామెంట్స్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే మరణిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణంతో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Russia – Ukraine War) కూడా ముగుస్తుందంటూ వ్యాఖ్యానించారు.
పారిస్‌లో బుధవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశం అనంతరం జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అతను (పుతిన్‌ను ఉద్దేశిస్తూ) త్వరలో చనిపోతాడు. ఇది నిజం. ఆయన మరణంతో రెండు దేశాల మధ్య యుద్ధం ముగుస్తుంది’ అని విలేకరులతో జెలెన్స్కీ అన్నారు. పుతిన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ గతకొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం నేపథ్యంలో జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరోవైపు ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనడం రష్యాకు ఇష్టం లేదని జెలెన్స్కీ ఈ సందర్భంగా ఆరోపించారు. యుద్ధం ఆపేందుకు రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, అమెరికా ప్రతిపాదించిన పాక్షిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రష్యాను ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అమెరికా ప్రతినిధులు సౌదీ అరేబియా వేదికగా రష్యాతో చర్చలు జరుపుతున్నారు.
Also Read..
America | యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థినికి బేడీలు వేసి తీసుకెళ్లిన అధికారులు.. వీడియో వైరల్
Donald Trump | ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. విదేశీ కార్లపై 25 శాతం సుంకం
Dropout Chaiwala | విదేశాల్లో చాయ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన డ్రాపౌట్..