Dropout Chaiwala | మెల్బోర్న్, మార్చి 26: విదేశాల్లో తన చాయ్ సామ్రాజ్యాన్ని స్థాపించి సక్సెస్ అయిన యువకుడి విజయ గాథ ఇది. కాలేజీ వీడి మరీ చాయ్ స్టార్టప్ మొదలుపెట్టిన ఆ విద్యార్థి పేరు సంజీత్ కొండా. తన నేపథ్యానికి తగ్గట్టుగా ఔట్‌లెట్‌కు డ్రాపౌట్ చాయ్‌వాలా అని పేరుపెట్టాడాయన.
బెంగళూరుకు చెందిన సంజీత్ ఉన్నత చదువుల కోసం 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లారు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి సంజీత్ స్టార్టప్‌కు రూపకల్పన చేశారు. 2021లో రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టి మెల్బోర్న్లోని ఎలిజబెత్ స్ట్రీట్‌లో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. ఈ స్టార్టప్‌కు వినూత్నంగా డ్రాపౌట్ చాయ్‌వాలా అని పేరు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. స్టార్టప్ సక్సెస్ అవడంతో 2023 మార్చిలో ‘మొబైల్ టీ ట్రక్’ను మొదలుపెట్టారు. అనంతరం ఆగస్టులో లా ట్రోబ్ స్ట్రీట్‌లో మరో ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. ఇలా డ్రాపౌట్ చాయ్‌వాలా ద్వారా 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.