మాస్కో: జర్మనీ, యూరప్‌లో ఎక్కడైనా అమెరికా క్షిపణి మోహరింపులకు దిగితే, అందుకు దీటుగా రష్యా స్పందిస్తుందని అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. మధ్య శ్రేణి అణ్వాయుధాల తయారీని తిరిగి ప్రారంభించడానికి వెనుకాడబోమని తెలిపారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సైనిక పరేడ్‌లో పుతిన్ మాట్లాడుతూ, మధ్య, స్వల్పశ్రేణి రేంజ్ క్షిపణుల మోహరింపుపై గతంలో విధించుకున్న మారటోరియం ఎత్తివేయటాన్ని పరిశీలిస్తామని అన్నారు.