ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యా ఎంతకైనా తెగిస్తుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. ఉక్రెయిన్‌లో అమెరికాకు చెందిన కెమికల్, బయోలాజికల్ ల్యాబొరేటరీలు ఉన్నాయని రష్యా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో ఎటువంటి నిజం లేదని అగ్రరాజ్యం కొట్టిపారేసింది.
ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఒక మీడియా సమావేశంలో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ మరోసారి ప్రస్తావించారు. ‘‘ఉక్రెయిన్‌లో కెమికల్, బయోలాజికల్ ఆయుధాలు ఉన్నాయనడం శుద్ధ అబద్ధం. అంతేకాదు భవిష్యత్తులో అలాంటి ఆయుధాలు ఉపయోగించేందుకు పుతిన్ వేస్తున్న ప్లాన్’’ అని బైడెన్ అన్నారు.
యూరప్‌లో అమెరికాకు సంబంధించిన బయోలాజికల్, కెమికల్ ఆయుధాలు ఉన్నాయనే వాదనలు పూర్తిగా అబద్ధాలని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌లో అవి ఉన్నాయని చెప్పారంటే.. అక్కడ ఆ ఆయుధాలు ఉపయోగించేందుకు పుతిన్ రెడీ అయ్యారనే అర్థమని మెచ్చరించారు.