వాషింగ్టన్: అమెరికాలోని మైనేలో ఉన్న బంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మంచు కురిసి ఓ ప్రైవేట్ బిజినెస్ జెట్ కూలిపోయి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం సాయంత్రం 7.45గంటలకు బయల్దేరే సమయంలో నే కూలిపోయిందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత విమానాశ్రయాన్ని మూసివేశారు. ‘ప్రయాణికుల విమానం తలకిందులైంది’ అంటూ టేకాఫ్నకు అనుమ తి ఇచ్చిన 45 సెకండ్లలో ఈ ఆడియో రికార్డ్ అయింది.