PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మారిషస్ (Mauritius) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు (Mauritius President) ధరమ్ గోకూల్ (Dharam Gokhool)తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గోకూల్కు అపురూప కానుక ఇచ్చారు. మహాకుంభమేళా నుంచి తీసుకెళ్లిన పవిత్ర గంగాజలాన్ని (Gangajal) బహుమతిగా అందజేశారు. గంగాజలంతోపాటు ఇతర బహుమతులు కూడా ఇచ్చారు. అంతకుముందు మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌తో మోదీ భేటీ అయ్యారు.
కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ మారిషస్ చేరుకున్న విషయం తెలిసిందే. రేపు జరిగే మారిషస్ 57వ జాతీయ దినోత్సవానికి (Mauritius National Day celebrations) ప్రధాని గౌరవ అతిథిగా (guest of honour) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కవాతు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భారతీయ సైనిక దళాలు పాల్గొంటున్నాయి. భారతీయ నౌకాదళ యుద్ధ విమానంతో పాటు వైమానిక దళానికి చెందిన ఆకాశ గంగా స్కై డైవింగ్ బృందం పాల్గొననుంది. హిందూ మహాసముద్రంలో ఉన్న మారిషస్‌తో భారత్‌కు గాఢమైన బంధం ఉన్నది. ఆఫ్రికా ఖండానికి వెళ్లేందుకు మారిషస్‌ను గేట్వేగా భావిస్తారు. హిస్టరీ, జియోగ్రఫీ, కల్చర్ ద్వారా రెండు దేశాలు కనెక్ట్ అయినట్లు మోదీ తెలిపారు. భారతీయ నేవీ, మారిషస్ అధికారుల మధ్య టెక్నికల్ అగ్రిమెంట్ జరగనున్నది. వాణిజ్యం, సీమాంతర ఆర్థిక నేరాలు, చిన్న..మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలపై రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.
Also Read..
PM Modi: మారిషస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
Rodrigo Duterte: ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ అరెస్టు
Drone Attack: మాస్కోపై డజన్ల సంఖ్యలో డ్రోన్లతో దాడి.. 69 యూఏవీలను కూల్చివేసిన రష్యా