మాస్కో: రష్యాపై డ్రోన్ల(Drone Attack)తో విరుచుకుపడింది ఉక్రెయిన్. రాజధాని మాస్కోపై తాజాగా అటాక్ జరిగింది. ఆ దాడిలో బహుళ అంతస్థు భవనం ధ్వంసమైంది. మాస్కో శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతిచెందినట్లు మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు. మంగళవారం ఉదయం మాస్కో ప్రాంతంలో సుమారు 69 యూఏవీలను కూల్చివేసినట్లు రష్యా వైమానిక శాఖ తెలిపింది. చాలా వరకు డ్రోన్లను.. మాస్కో బయటే కూల్చినట్లు తెలిపారు. నగరంలో ఒకే ఒక్క బిల్డింగ్ దెబ్బతిన్నట్లు చెప్పారు. డోమోడిడోవ్, విద్నోయి, రామెన్స్కోయి శివారు ప్రాంతాల్లో మూడు బిల్డింగ్లు డ్యామేజ్ అయ్యాయి.
గత ఏడాది నవంబర్‌లో రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ ఛేసింది. ఆ సమయంలో 32 యూఏవీలను వివిధ ప్రాంతాల్లో నేలమట్టం చేశారు. మాస్కోను టార్గెట్ చేస్తూ ఇవాళ ఉక్రెయిన్ సుమారు 91 డ్రోన్లను లాంచ్ చేసినట్లు చెప్పింది. తాజా అటాక్‌తో ఎయిర్ పోర్టులను మూసివేశారు. డజన్ల సంఖ్యలో ఫ్లయిట్లను దారిమళ్లించారు. రష్యాపై ప్రయోగించిన 337 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చినట్లు రక్షణ మంత్రిత్వ శాక తెలిపింది. వీటిల్లో 91 డ్రోన్లను మాస్కోపైకి ప్రయోగించారు. కుర్స్క్ ప్రాంతంపై 126 డ్రోన్లను విడిచారు.
బెల్గోరోడ్, కుర్స్క్, ఖేర్సన్, బ్రియాన్స్క్ లాంటి రష్యా ప్రాంతాలపై భీకర స్థాయిలో ఉక్రెయిన్ ఫైరింగ్ జరిపింది. కుర్స్క్ లో ఉన్న షాపింగ్ సెంటర్‌పై సోమవారం జరిగిన ఫైరింగ్‌లో నలుగురు మృతిచెందారు.