పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రసిద్ధి చెందిన లువ్రా మ్యూజియంలో భారీ చోరీ చోటుచేసుకుంది. మోనాలిసా లాంటి ప్రసిద్ధి చెందిన చారిత్రక కళాఖండాలు ఉన్న ఈ మ్యూజియంలో నెపోలియన్ కాలం నాటి ఆభరణాలను అపహరించారు. స్కూటర్‌పై వచ్చిన చోరులు మోటారు రంపాలను చేతబట్టి నిర్మాణంలో ఉన్న సీస్ ఫేసింగ్ ముఖ ద్వారం ద్వారా ప్రవేశించి అపోలో గ్యాలరీలోని గదిలోకి చేరడానికి హైడ్రాలిక్ లిఫ్ట్‌ను ఉపయోగించారు.
అనంతరం అమూల్యమైన ఆభరణాలను అపహరించారని ఫ్రాన్స్ మంత్రి లారెంట్ నూనెజ్ పేర్కొన్నారు. ఇది అతి పెద్ద చోరీగా అభివర్ణించారు. చోరీ సమయంలో అపోలో గ్యాలరీలో ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ ప్రదర్శన జరుగుతుందని వివరించారు. ఈ చోరీ అంతా ఏడు నిమిషాల్లో ముగిసిందన్నారు. నెపోలియన్, సామ్రాజ్ఞిల ఆభరణాల సేకరణ నుంచి తొమ్మిది ఆభరణాలను దొంగలు దోచుకున్నారని తెలిపారు. మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసేశారు.