న్యూఢిల్లీ : జపాన్లో మరోసారి భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10 కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రం ఉన్నదని, 6.7 తీవ్రతతో ఇది సంభవించిందని జపాన్ మెటిరోలాజికల్ ఏజెన్సీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. మరోవైపు అండమాన్, నికోబార్ దీవుల్లోనూ ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలులో 6.1గా నమోదైంది.