Sri Lanka | కొలంబో, ఫిబ్రవరి 9: ఓ కోతి చేసిన పని వల్ల శ్రీలంక దేశమంతటా చీకట్లు అలుముకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు కొలంబో దక్షిణ ప్రాంతంలోని విద్యుత్తు వ్యవస్థలోకి ఎక్కడి నుంచో వచ్చిన ఓ కోతి చొరబడింది. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంజినీర్లు వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించే పనిలో పడ్డారు. సాయంత్రం అయిదు గంటల సమయానికి దేశంలోని కొన్ని ప్రాంతాలకు ఇంకా విద్యుత్తు సరఫరా అందలేదని ఇంజినీర్లు పేర్కొన్నారు.
గ్రిడ్‌లోని ఓ ట్రాన్స్ఫార్మర్ను ఓ కోతి తాకడం వల్ల సరఫరా వ్యవస్థలలో అసమతుల్యత ఏర్పడిందని ఆ దేశ విద్యుత్తు శాఖ మంత్రి కుమార జయకోడి తెలిపారు. కోతి ప్రవేశం వల్ల జరిగిన నష్టం, డ్యామేజీని సరిదిద్దడానికి తమ ఇంజినీర్లు శ్రమిస్తున్నారని ఆయన వెల్లడించారు.