శనివారం 06 మార్చి 2021
International - Jan 27, 2021 , 20:05:38

దావోస్‌ సదస్సులో ప్రసంగించనున్న మోదీ

దావోస్‌ సదస్సులో ప్రసంగించనున్న మోదీ

న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం దావోస్ సదస్సు గురువారం జరుగనుంది. నాలుగో పారిశ్రామిక విప్లవంపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 400 మందికిపైగా అగ్రశ్రేణి పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పాల్గొనన్నారు. కార్యక్రమంలో పలు కంపెనీల సీఈఓలతోనూ ప్రధాని సంభాషించనున్నారు. ప్రతియేటా దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును నిర్వహించడం ఆనవాయితీ. అయితే, కరోనా కారణంగా ప్రస్తుతం దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఎప్పటిలా భౌతికంగా నిర్వహించే సదస్సు మాత్రం మే నెలలో సింగపూర్‌లో జరగనుంది. 2022లో డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సును యథావిధిగా దావోస్‌లో నిర్వహిస్తారు.

VIDEOS

logo