న్యూఢిల్లీ, డిసెంబర్ 30 : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాస గృహం లక్ష్యంగా దాడులు జరపడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ దేశాలు రెండూ శత్రుత్వాలను విడనాడి దౌత్య మార్గంలో సమస్య పరిష్కారానికి దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు.
91 డ్రోన్లతో ఉత్తర మాస్కో నోవ్గోర్డ్లోని పుతిన్ నివాసం లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు జరిపిందంటూ రష్యా సోమవారం ఆరోపించిన క్రమంలో మోదీ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు శత్రుత్వాలను అంతం చేయడానికి, శాంతిని సాధించడానికి అత్యంత ఆచరణీయ మార్గాలని ఆయన పేర్కొన్నారు.