బ్యాంకాక్: ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశంలో ఉన్న వెయ్యేళ్ల క్రితం నాటి హిందూ ఆలయాన్ని ఆయన సందర్శించారు. యోగ్యకర్తలో ఉన్న ప్రంబనన్ ఆలయాన్ని(Prambanan Temple) ఆయన విజిట్ చేసి అక్కడ పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీతో పాటు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కూడా ఆలయానికి వెళ్లారు. ప్రంబనన్ ఆలయంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల నిలయమే ప్రంబనన్ ఆలయం. ప్రస్తుతం ఈ ఆలయం.. ప్రపంచ వారసత్వ సైట్లో ఉన్నది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కు చెందిన ఏరియల్ వీడియోను ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. ప్రబంనన్ ఆలయం అద్భుతంగా ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఆలయంలో కాసేపు ఓం నమ శివాయ అని భక్తులతో కలిసి మోదీ పూజలు చేశారు.
Prambanan Temple Indonesia🔥
Muslim-majority country mein “Om Namah Shivaya” ka stuti gaan karwade, woh PM Modi 🔥 pic.twitter.com/FrlvfqA59e
— Lala (@FabulasGuy) July 8, 2026
దక్షిణాసియా దేశాల్లో ఉన్న అతిపెద్ద రెండవ ఆలయంగా ప్రంబనన్కు గుర్తింపు ఉన్నది. కాంబోడియాలో ఉన్న ఆంగకార్ వాట్ ఆలయం మొదటి స్థానంలో నిలుస్తుంది. ప్రంబనన్ ఆలయం సుమారు 40 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నది. ఆ ఆలయ సమూహంలో సుమారు 240 ఉప-ఆలయాలు ఉన్నాయి. ఇండోనేషియా సంస్కృతిలో ఈ ఆలయం ప్రత్యేకంగా నిలుస్తుంది. భారత్ ఉపఖండంలో ఇండోనేషియాతో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న సంకేతాన్ని ఇస్తుంది. 9వ శతాబ్ధంలో హిందూ మాతరం పాలకుల సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. రాకాయి పికాటన్ అనే చక్రవర్తి ఈ ఆలయాన్ని ప్రారంభించినట్లు భావిస్తున్నారు. లోకపాల చక్రవర్తి సమయంలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆ ఆలయ సమూహంలో మూడు ప్రధాన ఆలయాలు ఉన్నాయి.. వాటిల్లో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కొలువై ఉన్నారు. ఆ ఆలయ కాంప్లెక్స్ శివాలయం అత్యధికంగా 47 మీటర్ల ఎత్తు ఉన్నది.
ఆలయాలపై విశేష రీతిలో శిల్ప కళ ఉన్నది. రామాయణంతో పాటు హిందూ పురాణాలకు చెందిన ఎన్నో శిల్పాలను చెక్కారు. ఆ కాలం నాటి మతపరమైన, సంస్కృతిక పరమైన ఎన్నో అంశాలు ఆ ఆలయ శిల్పాల్లో ఉన్నాయి. 10వ శతాబ్ధంలో ప్రంబనన్ ఆలయాన్ని వదిలేశారు. జావాలో రాజకీయ మార్పులతో పాటు మౌంట్ మిరాపీ వద్ద అగ్నిపర్వతం పేలడం వల్ల ఆ ఆలయాన్ని తర్వాత కాలంలో విస్మరించారు. కానీ 19వ శతాబ్ధంలో డచ్ పాలన సమయంలో మళ్లీ పునరుద్దరణ జరిగింది. అయితే ఆ దేశ పురావాస్తు శాఖ 1913 నుంచి 1953 వరకు ఆ ఆలయాన్ని సమూహాన్ని పునర్ నిర్మించింది. 1991లో ప్రంబనన్ ఆలయానికి యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చింది.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी और इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबिआंतो ने योग्यकार्ता के प्रम्बानन मंदिर का दौरा किया और यहां पूजा-अर्चना की।
(वीडियो: डीडी न्यूज) pic.twitter.com/fIiZEDH8ZN
— ANI_HindiNews (@AHindinews) July 8, 2026