PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, స్లోవేకియాలలో మోదీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలపై చర్చలు జరపడంతోపాటు ఫ్రాన్స్‌లో జరిగే జీ7 దేశాల సదస్సులో కడా పాల్గొంటారు. ఈ సదస్సులో వివిధ దేశాధినేతలతో సమావేశమవుతారు. ఇందుకోసం న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి శనివారం ప్రధాని ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు.
1993 తర్వాత భారత ప్రధాని స్లోవేకియాలో పర్యటించనుండటం ఇదే మొదటిసారి. 14, 15 తేదీల్లో మోదీ స్లోవేకియాలో పర్యటిస్తారు. అక్కడి అధ్యక్షుడు పీటర్ పల్లెగ్రినితోపాటు ప్రధాని రాబర్ట్ ఫికోతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించి, పలు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అనంతరం ఫ్రాన్స్ చేరుకుంటారు. 16, 17 తేదీల్లో ఫ్రాన్స్‌లోని ఈవియన్‌లో ఉంటారు. అక్కడ జరిగే జీ7 దేశాల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు విదేశీ నేతలు, ప్రతినిధులు హాజరవుతారు. వారితో దక్షిణాది ప్రపంచం గురించి చర్చిస్తామని మోదీ తెలిపారు. అనంతరం 18వ తేదీన ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో జరిగే వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు.
Over the next few days, I will be in France and Slovakia to attend various programmes, including bilateral talks, multilateral engagements and interaction with the Indian diaspora. The focus will be on boosting economic as well as cultural linkages.
The visit will begin with…
— Narendra Modi (@narendramodi) June 13, 2026
అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మ్యాక్రోన్తో సమావేశమవుతారు. రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ వంటి అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రెండు దేశాల మధ్య స్టార్టప్‌లపై, పెట్టుబడులపై కీలక ఒప్పందాలు జరుగుతాయి. ప్రధాని తన పర్యటన వివరాల్ని మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.