సాధారణంగా మద్యం తాగే అలవాటు ఎవరికి ఉంటుంది అంటే.. దానికి సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే.. మద్యం అలవాటు అనేది మనిషిని బట్టి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి, పెరిగిన విధానం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సర్కిల్‌ను బట్టి ఉంటుంది కానీ.. మనిషిని చూసి అయితే.. మద్యం తాగే అలవాటు ఉందో లేదో చెప్పలేం కదా. కానీ.. మనిషిని చూసి అతడికి మద్యం తాగే అలవాటు ఉందో లేదో ఇట్టే చెప్పేయొచ్చు.. అని చెబుతోంది ఓ సర్వే.
ఫిట్‌గా ఉన్నవాళ్లు, జిమ్ బాడీ ఉన్నవాళ్లు.. రోజూ వ్యాయామాలు చేసేవాళ్లు.. చేయని వాళ్ల కంటే ఎక్కువ ఆల్కాహాల్ తీసుకుంటారట. టెక్సాస్‌కు చెందిన కొందరు రీసెర్చర్లు చెబుతున్న మాట ఇది. ఇటీవలే ఓ జర్నల్‌లో ప్రచురితమైన ఈ కొత్త స్టడీ ప్రకారం.. ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ ఉన్నవాళ్లు.. రోజూ గంటల కొద్దీ జిమ్ చేసేవాళ్లు.. ఎక్కువ మద్యం తీసుకుంటారట.
ఓవైపు ఫిట్నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ.. మరోవైపు ఆల్కాహాల్ సేవించడం అనేది అనారోగ్యానికి సంబంధించినది అయినప్పటికీ.. ఫిట్‌గా ఉండేవాళ్లు ఆల్కాహాల్‌కు మరింత అట్రాక్ట్ అవుతున్నారని స్టడీ వెల్లడించింది.
కాకపోతే.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఉన్నవాళ్లు మరీ ఓవర్‌గా తాగకుండా.. ఒక మోతాదు వరకే తాగుతారని.. ఫిట్నెస్ లేనివాళ్లలో చాలామంది ఎక్కువ మోతాదులో మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లు ఉంటారని స్టడీలో స్పష్టం చేశారు.