టెల్అవీవ్: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించిన అవినీతి కేసులో వివరాలు రాబట్టేందుకు పెగాసస్‌ను ఉపయోగించారని అక్కడి మీడియా పేర్కొంది. కేసుకు సంబంధించి చాలా కీలకమైన వ్యక్తి ఫోన్లోకి పెగాసస్ మాల్వేర్ను పంపి పోలీసులు సమాచారాన్ని రాబట్టారని చెబుతున్నాయి. నెతన్యాహు ప్రధానిగా ఉన్నప్పుడు ఇదే పెగాసస్‌ను వినియోగించి ప్రత్యర్థుల ఫోన్ల సమాచారాన్ని తస్కరించారని పలువురు చెబుతున్నారు.