టీవీ జర్నలిస్టులు లైవ్లో ఉండగా, వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. చుట్టూ చేరిన జనం వారికి విసుగు తెప్పిస్తుంటారు. లైవ్ కవరేజీకి అడ్డుపడుతుంటారు. అలా అడ్డుపడ్డ ఓ యువకుడి చెంప చెల్లుమనిపించింది ఓ పాకిస్తానీ జర్నలిస్ట్. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోలో టీవీ జర్నలిస్ట్ మైరా హష్మీ ఈద్ అల్-అధా వేడుకలపై లైవ్ కవరేజీ ఇస్తున్నారు. ఆమె చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఆమె మాట్లాడుతూ ఉండగా మధ్యలో ఒక్కసారిగా ముందున్న యువకుడి చెంపచెల్లుమనిపించింది. దీంతో అక్కడున్నవారంతా సైలెంట్ అయిపోయారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియోను ఇప్పటివరకూ 4.4 లక్షల మంది వీక్షించారు. కాగా, ఆమెతో వెకిలిగా ప్రవర్తించినందును చెంప చెల్లుమనిపించిందని స్థానికులు పేర్కొన్నారు.
????????? pic.twitter.com/Vlojdq3bYO
— مومنہ (@ItxMeKarma) July 11, 2022