Asim Munir | ఆఫ్ఘాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (Tehreek-e-Taliban Pakistan) ఉగ్రవాదులు పాక్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. పాక్ ఆర్మీ చీఫ్ మార్షల్ ఆసిం మునీర్ (Asim Munir)కు టీటీపీ (TTP) తీవ్ర హెచ్చరికలు చేసింది. దమ్ముంటే తమను ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరింది. ఈ మేరకు వీడియో విడుదల చేసింది.
తమ మీదకు సైనికులను పంపించడం మానుకోవాలని, బదులుగా పాక్ ఉన్నతాధికారులే యుద్ధభూమికి రావాలని సవాల్ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఆకస్మిక దాడి దృశ్యాలను టీటీపీ విడుదల చేసింది. ఈ దాడిలో 22 మంది పాక్ సైనికులు మరణించినట్లు పేర్కొంది. అయితే, ఈ వీడియోలో కనిపించిన కమాండర్ కాజిమ్గా పాక్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు కాజిమ్ తలపై 10కోట్ల పాకిస్థానీ రూపాయల రివార్డు ప్రకటించారు. అతడి ఆచూకీ చెప్పిన వారికి ఈ మొత్తం ఇస్తామని వెల్లడించారు.
Also Read..
Rahul Gandhi | మహాకూటమి పోస్టర్ల నుంచి రాహుల్ ఫొటో మాయం.. బీజేపీ తీవ్ర విమర్శలు
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?
SpiceJet | పాట్నా వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీకి దారిమళ్లింపు