Rahul Gandhi | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాఘట్బంధన్ (Mahagatbandhan)లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూటమి తరఫున సీఎం అభ్యర్థి (CM candidate) ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పోస్టర్ల (Mahagathbandhan poster) నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫొటో మాయమవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వచ్చే నెల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు ప్రతిపక్ష కూటమి పార్టీలు పాట్నాలోని ఓ హోటల్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఫొటోను మాత్రమే ప్రముఖంగా ప్రదర్శించారు. మిగతా భాగస్వామ్య పార్టీల నేతల చిన్న ఫొటోలను పోస్టర్లలో ఏర్పాటు చేశారు. అయితే, అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫొటో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన పోస్టర్లు కూడా నెట్టింట వైరల్గా మారాయి.
దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు విమర్శలకు ఎక్కుపెట్టింది. తేజస్వి యాదవ్, ఆయన మద్దతుదారులు.. రాహుల్ నాయకత్వాన్ని అవమానించారంటూ వ్యాఖ్యానించింది. తాజా పరిణామాలపై బీజేపీ నేత షెహజాద్ పూనవాలా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘నిన్నటి వరకూ రాహుల్ గాంధీయే కూటమి ముఖచిత్రంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదని స్పష్టమవుతోంది. ఈ కూటమికి గందరగోళం, విభజన, పదవుల కోసం ఆశ తప్ప.. ఒక లక్ష్యం గానీ, దార్శనికత గానీ లేవు’ అంటూ ఎద్దేవా చేశారు.
Also Read..
Tejashwi Yadav | మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?
SpiceJet | పాట్నా వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీకి దారిమళ్లింపు