Groom | పెళ్లి.. ఎంతో ముఖ్యమైన వేడుక. జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ వేడుకను యువతీ యువకులు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను నెలల ముందు నుంచే మొదలు పెట్టేస్తారు. పెళ్లి రోజున ఎంతో అందంగా, బ్రైట్‌గా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం దుస్తుల దగ్గర నుంచి, అలంకరణ వరకూ అన్నీ అందరినీ ఆకట్టుకునేవిలా ఉండేలా చూసుకుంటారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ వరుడు కూడా ఇలానే ఆలోచించాడు.
పెళ్లి వేడుకలో తనకు కాబోయే భార్య చాలా బ్రైట్‌గా అందంగా కనిపించాలని కోరుకున్నాడు. ఇందుకోసం ఆమె డ్రెస్‌ను ఇప్పటి వరకూ ఎవరూ ధరించని, ఊహించని విధంగా డిజైన్ చేయించాడు. ఏకంగా ఎల్ఈడీ లైట్స్ (LED lights)తో లెహంగా (Lehenga)ను ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. మెహందీ వేడుకలో ఆ లెహంగా ధరించిన వధువు ప్రకాశవంతంగా మెరుస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
G20 Summit | జీ20 సమ్మిట్ వేళ.. ఢిల్లీలో బైడెన్, సునాక్, ట్రూడోస్ బస ఎక్కడంటే..?
Russia – Ukraine | ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన రష్యా.. 17 మంది మృతి