ఇస్లామాబాద్: పాకిస్థాన్ సుప్రీంకోర్టు శుక్రవారం అందరు న్యాయమూర్తుల సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణలపై నిరసన తెలుపుతూ సుప్రీంకోర్టులోని ఇద్దరు జడ్జీలు రాజీనామా చేశారు. ఈ సవరణలు రాజ్యాంగంపై జరిగిన తీవ్రమైన దాడి అని మండిపడ్డారు. ప్రతిపక్షాలు కూడా ఈ సవరణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇది ప్రజాస్వామ్యాన్ని అణచివేసే సవరణ అని, రాజ్యాంగపరమైన ప్రశ్నలు గల కేసులను ఇకపై సుప్రీంకోర్టు విచారించడం సాధ్యం కాదని, ఆర్మీ చీఫ్ అధికారాలను, పదవీ కాలాన్ని పొడిగిస్తున్నదని విమర్శిస్తున్నాయి. ఇదిలావుండగా, సుప్రీంకోర్టులో మొత్తం 24 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరిలో ఇద్దరు రాజీనామా చేసిన తర్వాత మిగిలిన న్యాయమూర్తులు ఈ సవరణ అమలును నిలిపివేయవచ్చు.