న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ యూట్యూబ్ చానల్‌ను భారత్ శుక్రవారం సస్పెండ్ చేసింది. ఇటీవల పలువురు పాక్ నటుల సామాజిక మాధ్యమ ఖాతాలను కేంద్రం బ్లాక్ చేసింది. ఈ కోవలోనే ఇప్పుడు పాక్ ప్రధాని యూట్యూబ్ చానల్‌ను నిషేధించింది. భారత జాతీయ సమగ్రతను దెబ్బ తీసేలా, భారతీయులను తప్పు దోవ పట్టించేలా పాక్‌కు చెందిన మీడియా, సోషల్ మీడియా సంస్థలు, వ్యక్తులు కంటెంట్‌ను సృష్టించి వ్యాప్తి చేస్తున్నారని కేంద్రం మండిపడుతున్నది.