న్యూఢిల్లీ, మే 29: భారత్‌పై తాము దాడులు జరపాలని నిర్ణయించుకున్న తర్వాత రాత్రికి రాత్రే తమ వైమానిక స్థావరాలపై భారత్ సాయుధ దళాలు దాడులు జరిపాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. మే 9-10వ తేదీ మధ్య రాత్రి రావల్పిండిలోని విమానాశ్రయంతోసహా ముఖ్యమైన వైమానిక స్థావరాలపై భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణులు విరుచుకుపడి విధ్వంసం సృష్టించాయని షరీఫ్ వెల్లడించారు.
10వ తేదీ తెల్లవారుజామున ప్రార్థనల తర్వాత 4.30 గంటలకు భారత్‌పై దాడి చేయాలని సైన్యం నిర్ణయించిందని, అయితే తెల్లారక ముందే బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు దాడి చేశాయని ఆయన వెల్లడించారు.